రామాలయ నిర్మాణానికి సైంటిస్టు విరాళం

రామాలయ నిర్మాణానికి సైంటిస్టు విరాళం

బిక్కనూర్, (ఆంధ్రప్రభ): మండలంలోని రామేశ్వర్‌పల్లి గ్రామంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న రామాలయ నిర్మాణానికి ప్రముఖ శాస్త్రవేత్త, సామాజిక సేవకుడు పైడి ఎల్లారెడ్డి రూ.5.50 లక్షల విరాళాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన సేవాభావాన్ని అభినందిస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ఘనంగా సన్మానించారు. రామాలయ నిర్మాణానికి పైడి ఎల్లారెడ్డి అందించిన విరాళం గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. గ్రామంలోని రామభక్తులు, దాతలు కూడా తమ వంతు సహకారం అందించి ఆలయ నిర్మాణాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు మద్ది సూర్యకాంత్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చేపూరి రాణి రాజు, ఉపసర్పంచ్ గొల్లపల్లి వినోద్ గౌడ్, టెంపుల్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, మాజీ వీడీసీ అధ్యక్షుడు తక్కళ్ల నర్సిరెడ్డి, రెడ్డిగారి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.