School | భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల నిరసన

School | భోజనం నాణ్యతగా లేదని విద్యార్థుల నిరసన

School | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండడం లేదని విద్యార్థులు ఈ రోజు దండేపల్లి మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో విద్యార్థులు తినే అన్నం ప్లేట్లతో బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కొద్దిరోజులుగా కనీసం మెనూ పాటించడం లేదని, అన్నం ముద్దలుగా, కూరలు చారులా వండిపెడుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. వారంలో ఒక్కటే గుడ్డు ఇస్తున్నారని, నాణ్యతలేని భోజనం తినలేక పస్తులు ఉంటున్నామని వాపోయారు. ఉన్నత అధికారులు మధ్యాహ్నభోజన నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్శ రాజేశ్వర్ రావు విద్యార్థులకు నచ్చజెప్పి తరగతులకు పంపించారు.

Leave a Reply