school | అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక..

school | అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక..

school | సత్తుపల్లి, ఆంధ్రప్రభ : సత్తుపల్లి వాస్తవ్యుడు బాల సాహితీవేత్త ఆవుల పోతురాజుకు ఉత్తర అమెరికాలో ఈనెల 30న తానా ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ(International) బాల సాహిత్య బేరీలో పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. తాను రచించిన నాన్నే నా హీరో(Dad is my hero) పుస్తకం సదస్సులో వినిపించేందుకు పోతురాజు సిద్దపడ్డారు.

అరుదైన ఈ అవకాశం లభించిన పోతురాజును పాఠశాల(school) ప్రధానోపాధ్యాయులు ఎస్ కే. సొందు, తెలుగు ఉపాధ్యాయురాలు ఎం. రమాదేవి, గార్లపాటి, బొల్లెపల్లి ట్రస్ట్ నిర్వాహకులు, రామకృష్ణ, మధుసూదనరాజుతో సహా పలువురు అభినందించారు.