Student | బాల్యవివాహాలు సాంఘిక దురాచారం
Student | బాల్యవివాహాలు సాంఘిక దురాచారం
ఉయ్యూరు రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు
Student | ఉయ్యురు, ఆంధ్రప్రభ : బాల్యవివాహాలు ఒక సాంఘిక దురాచారం అని, అంతేకాకుండా నేరమని వీటి పట్ల ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఉయ్యూరు రూరల్ సబ్ ఇన్‌స్పెక్టర్ సురేష్ బాబు (Sub Inspector Suresh Babu) సూచించారు. బాల్య వివాహాల పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఉయ్యూరులోని ఆకునూరు ప్రభుత్వ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. అలాగే బాల్యవివాహాలు నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కట్టుబడి పని చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. బాల్యవివాహాల (Child marriages) వల్ల బాలికల విద్య రక్షణ, ఆరోగ్యంతో పాటు వారి అభివృద్ధికి ఆటంకంగా కలుగుతుందని తెలిపారు. విద్యార్థి దశలో తాము కన్న కలలను సాకారం చేసుకునే అవకాశం కూడా వారికి దూరమవుతుందని తెలిపారు. ఎక్కడైనా బాల్యవివాహం జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత గ్రామపంచాయతీలో గానీ, ఇతర ప్రభుత్వ అధికారులకు గానీ తెలియజేయాలని సూచించారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను తల్లిదండ్రులకు సైతం వివరించాలని సురేష్ బాబు కోరారు.
