Sparrow | పిచ్చుకల స్ఫూర్తితో మానవుడు కష్టం..

ఇంటి నిర్మాణం కోసం మానవుడు కష్టపడ్డ విధంగా అనాది నుండి పిచ్చుకలు కష్టపడ్డాయి..

Sparrow | వికారాబాద్, ఆంధ్రప్రభ :వికారాబాద్ అటవీ ప్రాంతంలో రోజురోజుకు వివిధ రకాలైన పిచ్చుకలు కనుమరుగుతున్నాయి. గతంలో వివిధ రకాల పిచ్చుకలు తమ పిచ్చుక గూడు కోసం ఇతర ప్రాంతాల నుండి గడ్డి పోసలను తీసుకువచ్చి చెట్టుపై పిచ్చుక గూడును ఏర్పాటు చేసేవి. అవికారమ సమయంలోని అనంతగిరి బుగ్గ రామేశ్వరం , సర్పను పల్లి లోగల అడవుల్లో పలుచోట్ల లో ఇటువంటి పిచ్చుక గూళ్ళు కనిపించేవి. రోజురోజుకు విస్తరిస్తున్న ఫామ్ హౌస్ లో ఇతర ఆధునిక సాంకేతిక నేపథ్యంలో ఇటువంటి పిచ్చుక గుళ్ళు కనిపించడం లేదు. పిచ్చుక గూటిని నిర్మించి అందులో వాటి పిల్లలనుంచి ఇతర ప్రాంతాల నుండి వాటికోసం ఆహారం గడ్డి కోసం తీసుకువచ్చి పిచ్చుక చిన్న పిల్లలను జీవించలా చేసేవి. వీటిని మనం పరిశీలిస్తే అది స్ఫూర్తిగా తీసుకొని మనిషి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టాడని చెప్పుకోవచ్చు. చిన్న ప్రారమైన పిచ్చుక తన పిల్లల కోసం ఇంటి నిర్మాణం చేపట్టి పిచ్చుక గుణం తయారు చేయగా విజ్ఞానవంతుడైన మానవుడు తన ఇంటిని మనం కోసం తన శాశక్తులకు కృషి చేస్తూ జీవితంలో ఒక ఇంటి నిర్మాణం జరపాలని భావించి ఇల్ల నిర్మాణం జరుపూ తున్నారు. పిచ్చుక గుళ్లను పరిశీలిస్తే ఆహ్లాదకరంగా ప్రకృతి రమణీయత మధ్య చెట్లపై ఉండే పిచ్చుక గుళ్ళు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయి హైదరాబాద్ నగరానికి అతి చేరులో ఉన్న వికారాబాద్ లో ఇటువంటి చెట్లు ఎన్నో ఉంటాయి. అటవి శాఖ రెవెన్యూ తదితర శాఖలు శ్రద్ధ వహిస్తే ఇటువంటి పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు చేకురే అవకాశం ఉంది.