కరీంపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పరిరక్షించాలి

కరీంపూర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పరిరక్షించాలి
వికారాబాద్, ఆంధ్రప్రభ:
కోటిపల్లి మండలం కరీంపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను పరిరక్షించాలని ఎస్సీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సంబంధించిన నిధులతో నిర్మించిన చర్చి నిర్మాణాన్ని వెంటనే తొలగించాలని వారు కోరారు. ఆ నిధులను ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం వినియోగించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన నిధులు ఇతర నిర్మాణాలకు మళ్లించడం సరికాదని సమితి నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, లక్ష్మణ్, నరసింహ, ఆర్. మాధవి, తదితరులు పాల్గొన్నారు.
