Breaking News | రాజ్ కుమార్ ఆత్మహత్య…
కొత్తూరు మండలం పంజర్ల గ్రామంలో మృతదేహం లభ్యం
Breaking News | చేవెళ్ల, జులై 13 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్ లో ఆరుగురిని హత్య చేసిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో మేనమామ ఊరు కొత్తూరు మండలం పింజర్ల గ్రామంలో అతని మృతదేహం లభ్యమయింది. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పురుగుల మందుల బాటిల్ ఉన్నట్లు సమాచారం.
డయల్ 100 ద్వారా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని చూసి రాజ్ కుమార్ గా గుర్తించారు. మొత్తం మీద సైకో కిల్లర్ రాజ్ కుమార్ హతమయ్యాడు. కిరాతకుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

రాజ్ కుమార్ సెల్ఫీ వీడియోను పోలీసులు విడుదల చేశారు. . అందులో తాను ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. “ఆ అమ్మాయిని నమ్మి చాలా మోసపోయాను” అని పేర్కొంటూ, ఈ దారుణానికి ఒడిగట్టడానికి గల కారణాలను వీడియోలో వివరించాడు.
