Sbi-Atm-Theft : ఎస్బీఐకి ,, షాక్​ Andhra Prabha Crime News

  • ఏటీఎం లో భారీ చోరీ
  • అనంత జిల్లా టార్గెట్​
  • బుక్కరాయసముద్రంలో
  • ఏటీఎం ఎత్తుకెళ్లి మరీ చోరీ
  • ఆకులోడులో మిషన్​ దహనం
  • బీహారీ గ్యాంగ పై అనుమానం

( బుక్కరాయసముద్రం , ఆంధ్రప్రభ )

Sbi-Atm-Theft : అనంతపురం జిల్లా బుక్కారాయ సముద్రంలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ ఏటీఎం మిషన్‌ను దర్జాగా దొంగలు ఎత్తుకెళ్లారు. సింగమల మండలం ఆకులోడు వద్ద ఏటీఎంను పడవేశారు. పెట్రోల్ పోసి బాక్స్ ను తగలబెట్టారు. ఇంతకీ అందులో నగదు ఎంత ఉంది. ఎంత దొంగలకు దక్కింది, అనే అంశం ప్రస్తుతం మిస్టరీ.

ఇక యథావిధిగా పోలీసుల క్లూస్ టీం రంగంలోకి దిగింది. తనిఖీలూ చేపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగల పనిగా అనుమానం.. బీహార్ గ్యాంగ్ పనిగా పోలీసులు చెప్తున్నారు ప భారీ మొత్తంలో నగదు దోచుకు వెళ్లినట్టు అనుమానిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాలోని ఏటీఎంలను టాన్గెట్​ చేసుకున్న ముఠా.. తరచుగా.. ఇక్కడి ఏటీఎంలను కొల్లగొట్టేస్తోంది.