Photo Shoot | న్యూ లుక్ లో “కుష్బూ” …

సీనియ‌ర్ నటి ఖుష్బూ కొత్త లుక్ లో క‌నిపించి అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.. ఇటివ‌ల ఆమె చేసిన ఫోటో షూట్ చిత్రాల‌ను త‌న ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఖుష్బూ తను షేర్ చేసిన ఫోటోలకు ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ అనే క్యాప్షన్ పెట్టారు. దీనిపై కొందరు నెటిజన్లు ఆమె సన్నబడిన తీరును ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం సన్నగా మారడానికి ఇంజెక్షన్స్ చేయించుకున్నారని, వాటి మాయ వల్లనే ఇలా మారిపోయారని, వాటి గురించి ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి అంటూ రకరకాలుగా కామెంట్స్ పెట్టారు.

ఈ కామెంట్స్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ఖుష్బూ.. వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. “మీరెటువంటి మనుషులు? మీరెప్పుడూ మీ ముఖాలను సోషల్ మీడియాలో పంచుకోరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply