లక్కారం క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 109 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను లక్కారంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద కాలంలో పేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అందించే సీఎంఆర్‌ఎఫ్ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతకు, సంక్షేమానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తారని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
తమకు ఆర్థిక సహాయం అందేలా సహకరించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మునుగోడు ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నర్సింహగౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోయ దేవేందర్, మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు మొగుదాల రమేష్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
