Sattenapalli | వారసంత ప్రారంభం

Sattenapalli | వారసంత ప్రారంభం

  • సత్తెనపల్లిలో ఏర్పాటు

Sattenapalli | ఖానాపూర్‌ రూరల్‌, ఆంధ్రప్రభ : ఖానాపూర్‌ మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో శనివారం వారసంతను అధికారికంగా ప్రారంభించారు. పలు గ్రామాలకు మధ్యలో సౌకర్యవంతమైన ప్రాంతంగా ఉన్న సత్తెనపల్లిలో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు కూరగాయలు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్ల కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండగా, సత్తెనపల్లిలోనే వారసంత ప్రారంభం కావడంతో సేవ్య నాయక్ తండా, తర్లపాడు, ఎల్లాపూర్, గోసంపల్లి తదితర గ్రామాల ప్రజలకు దూర ప్రయాణం తప్పనుంది.

అందుబాటులోనే అన్ని రకాల కూరగాయలు, సరుకులు లభించనున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్ విజయ్ ఆనంద్‌, ఉప సర్పంచ్  చైతన్య లక్ష్మణ్, వార్డు సభ్యులు, పోశెట్టి, వీరయ్య, నరేష్, ఇబ్రం నాయక్, రజిత రమేష్,  శివకుమార్,  రమేష్, రవీందర్, సునీత నరేష్, పాలకవర్గాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.

Leave a Reply