108 సిబ్బందికి కూలర్ వితరణ చేసిన సర్పంచ్
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని 108 లో సేవలు అందిస్తున్న సిబ్బందికి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్,ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ఆదివారం కూలర్ ను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్మర్ పల్లి మండల పరిధితో పాటు చుట్టూ పక్కల మండలాలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తూ… ఎంతో మంది ప్రాణాలను కాపాడి వారికి మనో ధైర్యాన్ని అందించే.. 108 సిబ్బంది అత్యవసర కేసులకు వెళ్లి తిరిగి రాగానే కార్యాలయంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక పోతున్నామని తమ దృష్టి తీసుకురాగా తక్షణమే స్పందించి వారికి కూలర్ ను వితరణ చేసినట్లు తెలిపారు.
108 సిబ్బంది మాట్లాడుతూ తాము అడగగానే తక్షణమే స్పందించి మా కార్యాలయానికి కూలర్ వితరణ చేసిన సర్పంచ్ హారిక ల,ఉపసర్పంచ్ అశోక్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ ప్రోత్సాహంతో ఇంకా రెట్టింపు స్థాయిలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్,మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్,పన్నాల రవి, సింగిరెడ్డి భరత్ రెడ్డి,రమేష్,108 సిబ్బంది కొత్తపల్లి సాగర్,సుంకరి విజయ్ కుమార్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
