MLA | బీఆర్ఎస్‌లోకి జంప్‌..

MLA | బీఆర్ఎస్‌లోకి జంప్‌..

  • కాంగ్రెస్‌ను వీడిన ప‌లువురు

MLA | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో పలువురు మాజీ మంత్రి, బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి(MLA Vemula Prashanth Reddy) సమక్షంలో చేరారు. ఈ రోజు వేల్పూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో వీరు గులాబీ కండువా క‌ప్పుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

మున్సిపల్‌గా ఏర్పాటు చేసి పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి(Development) చేసిన బీఆర్ఎస్‌ను అందరిస్తున్నారనే దానికి ఈ చేరికలే నిదర్శనమ‌ని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో చేరిన వారిలో మీసాల శ్రీనివాస్, శ్రీను, గంగాధర్, ప్రవీణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ముత్యం, రాజేష్, రాజేశ్వర్, డప్పు సాయి, గంగాధర్, భాస్కర్, మీసాల నవీన్ ఉన్నారు. వీరితో పాటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల బాల భగత్, సురేష్, చంటి పాల్గొన్నారు.

Leave a Reply