cricket | సఫారీ.. సగం వికెట్లు ఢమాల్
cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ జట్టు ఆటగాళ్లు ఘోరంగా విఫలమవుతున్నారు. 130 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్‌గా టోని డీ జోర్జి 24 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. బుమ్రా 3, కుల్దీప్ రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికా టాప్ లేపారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు బుమ్రా, కుల్దీప్ రెచ్చిపోతున్నారు. 71 రన్స్‌కే 3 వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా టాపార్డర్‌ను కుప్పకూల్చారు. లంచ్ తర్వాత నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. నాలుగో వికెట్‌గా ముల్డర్ 24 పరుగులు చేసి కుల్దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రికెల్టన్ను (23), మార్క్రమ్ (31), కెప్టెన్ బవుమాను (3) పరుగులు చేసి ఔటయ్యారు.

