ఉచిత గాలికుంటు టీకా కార్యక్రమంలో బీజేపీ నాయకుల ఆందోళన

ఉచిత గాలికుంటు టీకా కార్యక్రమంలో బీజేపీ నాయకుల ఆందోళన
కోహెడ, ఆంధ్రప్రభ : మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో జిల్లావైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏడవ విడత ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించారు. జీడీ డాక్టర్ కొండల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పశువుకు టీకా వేసి ఉచిత మెగా క్యాంపును ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతుండగా బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు బోయిని యాదయ్య కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఫొటోను ఫ్లెక్సీ లో పెట్టకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించడం లేదని, రైతులకు కూడా సమాచారం ఇవ్వలేదని నిలదీశారు.

కార్యక్రమంలో 85 పశువులకు గర్భకోశ చికిత్సలు, అలాగే 135 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేసి మందులు పంపిణీ చేసినట్లు శనిగరం పశువైద్యాధికారి ఆర్.శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో మండల పరిషత్ వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్, తాజా మాజీ ఎంపీటీసీ కోనే శేఖర్, పంచాయతీ కార్యదర్శి మేడి రమేష్, పాలకేంద్రం అధ్యక్షులు దుశెట్టి నరసింహారెడ్డి, గోపాలమిత్రలు, రైతులు తదితరులు పాల్గొన్నారు
