తరుగు పేరుతో ధాన్యం రైతులు నిలువు దోపిడి..

తరుగు పేరుతో ధాన్యం రైతులు నిలువు దోపిడి..

  • సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను నిలువ దోపిడి చేస్తున్నారని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు.శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో సిపిఐ పార్టీ మండల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.వల్లమల్ల సామెల్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలకు ఐదు కేజీలను తరుగు తీస్తున్నారని ఆరోపించారు. తరుగు పేరుతో అడ్డగోలుగా కోత విధిస్తూన్నారన్నారు.

తరుగు తీసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమా చేయాలని ప్రభుత్వాన్ని సాబీర్ పాషా డిమాండ్ చేశారు.రైతుల ఖాతాల్లో జమ చేయాలి రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు వస్తున్న రైతులను నిలువునా మోసం చేయడం అన్యాయమన్నారు.తరుగు పేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడిన టార్పాలిన్లు, గిడ్డంగి సౌకర్యం,తాగునీరు, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని,నిబంధనలు అతిక్రమిస్తున్న వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరల పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందన్నారు.దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారని సాబీర్ పాషా విమర్శించారు.ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్,మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, యల్లంకీ మధు,యాస రోశయ్య,తూముకోటయ్య,పొన్నెకంటి వెంకటేశ్వర్లు,కంచర్ల రాఘవేంద్రరావు,సిరిపురపు వెంకటేశ్వర్లు,కొండ వీరయ్య, చిమట ముత్తయ్య,పాలెపు ప్రభాకర్,ఊడల సుధా,బరగడ రమేష్,పత్తిపాటి మహేష్,ఉదారి నాగయ్య,చల్లగొండ్ల సతీష్, చీమకుర్తి సంతోష్,యరదశి రామారావు తదితరులు పాల్గొన్నారు.