12వ డివిజన్‌లో ముమ్మరంగా ప్రారంభమైన ఎస్‌ఐఆర్‌

ఖమ్మం ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌-2026) కార్యక్రమం గురువారం నగరంలోని 12వ డివిజన్‌లో ముమ్మరంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్‌ఏలు ఆయా పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బీఎల్‌ఓలకు ఓటర్ల ఇంటి చిరునామాలను చూపిస్తూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో సహకరించారు. అనంతరం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు.

ఓటరు జాబితాల పునర్విమర్శ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి అర్హుడైన ఓటరుకు ఫారం అందేలా బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ దివ్య, బీఎల్‌ఓలు, మాజీ కార్పొరేటర్ చిరుమామిళ్ల లక్ష్మి, స్థానిక నాయకులు దండా ప్రసాద్, ఆలస్యం శేఖర్, వల్లభనేని రామారావు తదితరులు పాల్గొన్నారు.