మరణానంతరం నేత్రదానం..
మరణానంతరం నేత్రదానం..
చివరి కోరిక నెరవేర్చిన కుటుంబసభ్యులు
ఎడపల్లి, ఆంధ్రప్రభ: ఎడపల్లి మండలం మంగళ్పహాడ్ గ్రామానికి చెందిన పాలకూరల పుష్పమ్మ (86) శుక్రవారం మృతి చెందారు. మరణానంతరం తన నేత్రాలను దానం చేయాలన్న ఆమె చివరి కోరికను కుటుంబసభ్యులు నెరవేర్చారు. పుష్పమ్మ మృతిచెందిన అనంతరం కుటుంబసభ్యుల సమ్మతితో ఆమె నేత్రాలను దానం చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ దానం ద్వారా మరొకరికి చూపు కలిగే అవకాశం ఉండటం గొప్ప విషయమని స్థానికులు పేర్కొన్నారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మృతురాలి నేత్రాలను సేకరించి, హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించినట్లు లయన్స్ క్లబ్ ప్రతినిధి సూర్యనారాయణ తెలిపారు.
