36people | ఒకరి మృతి, పలువురికి గాయాలు

36people | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాల్వాయిపాడు జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిలిచివున్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.