జూన్ 2ను ఆర్టీసీ అపాయింట్‌మెంట్ డేగా ప్రకటించాలి

జూన్ 2ను ఆర్టీసీ అపాయింట్‌మెంట్ డేగా ప్రకటించాలి

  • జేఏసీ

తొర్రూరు, ఆంధ్రప్రభ:

జూన్ 2ను ఆర్టీసీ అపాయింట్‌మెంట్ డేగా ప్రకటించాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ జిలుకర యాదగిరి కోరారు. ఈ మేరకు ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, జూన్ 2ను అపాయింట్‌మెంట్ డేగా ప్రకటిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిందని, ఆ హామీని అమలు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.
ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ ప్రైవేట్ బస్సులను రద్దు చేసి, ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని కోరారు.

కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని యాదగిరి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు మల్లికార్జున్, ఎంకే రావు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply