పులి మామిడిలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన

పులి మామిడిలో మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
ఊట్కూర్, ఆంధ్రప్రభః నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో నూతనంగారూ. 3.50 కోట్లతో నిర్మించనున్న సబ్ స్టేషన్ భూమి పూజ చేపట్టేందుకు రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరుకానున్నట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షులు డి. యజ్ఞేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనకు మండలంలోని ఆయా గ్రామాల సర్పంచ్ లు ప్రజా ప్రతినిధులు యువజన కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతంచేయాలనికోరారు.
