kalma homework| సైదాబాద్ సక్సెస్ స్కూల్లో వివాదం
kalma homework| సైదాబాద్ సక్సెస్ స్కూల్లో వివాదం
రెండో తరగతి విద్యార్థికి కల్మా, సూరహ్ ఫాతిహా హోంవర్క్ ఇచ్చారన్న ఆరోపణలు
టీచర్‌ను విధుల నుంచి తొలగించిన యాజమాన్యం..
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు, విచారణ కొనసాగింపు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సక్సెస్ స్కూల్లో మతపరమైన హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలు వివాదానికి దారితీశాయి. రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి ‘కల్మా’, ‘సూరహ్ ఫాతిహా’ రాసి, పఠించాలని హోంవర్క్ ఇచ్చినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఈ ఘటనపై తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం స్పందించి, సంబంధిత ఉపాధ్యాయురాలు షేక్ ఆయిషా పర్వీన్‌ను విధుల నుంచి తొలగించింది. అలాగే భవిష్యత్తులో సక్సెస్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఆమెకు ఉద్యోగావకాశం కల్పించబోమని తెలిపింది.
ఘటనపై విద్యార్థి కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే సమయంలో పాఠశాల వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
