ఆర్టీసీ బస్సు- కారు ఢీ..
రేగొండ, ఆంధ్రప్రభ : ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం భాగీర్తిపేట, భూపాలపల్లి ప్రధాన రహదారిపై కొడవటoచ ఆర్చి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి వైపు వెళుతున్న కారు పరకాల వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొనగా కారులో ప్రయాణిస్తున్న డిటిఓ కార్యాలయ అధికారులు రజిత, లక్ష్మి ప్రమాదంలో గాయపడ్డారు. ప్రమాదం అనంతరం స్థానికులు 108 కి ఫోన్ చేయగా వీరిని సమీప పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
