Sensex 150.63 | ఐటీ షేర్ల అమ్మకాల ప్రభావం

Sensex 150.63 | ఐటీ షేర్ల అమ్మకాల ప్రభావం

Sensex 150.63 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఐటీ రంగ షేర్లలో అమ్మకాలు పెరగడం వల్ల సూచీలు రోజంతా ఒడుదొడుకులను ఎదుర్కొన్నాయి. BSE Sensex 150.63 పాయింట్లు కోల్పోయి 73,832.55 వద్ద ముగియగా, Nifty 50 53.35 పాయింట్లు తగ్గి 23,161.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.75 వద్ద కొనసాగుతోంది.

ఉదయం 73,615.99 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వెళ్లి 74,394.34 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే చివరికి మళ్లీ అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎటర్నల్‌ షేర్లు నష్టపోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ చమురు ధర బ్యారెల్‌కు 92 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 4,092 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Leave a Reply