టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా రాజభద్రయ్య
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామానికి చెందిన బందెల రాజభద్రయ్య నియమితులయ్యారు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ శాఖ రాష్ట్ర కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా బందెల రాజభద్రయ్యకు ఈ పదవి లభించింది. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో రాజభద్రయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్బంగా రాజభద్రయ్య మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ గా నియమించినందుకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ,సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి,ఏఐసిసి ఎస్సీ విభాగం జాతీయ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు రాజభద్రయ్య కృతఙ్ఞతలు తెలిపారు.
