Monsoon Health Tips I 10 ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ముప్పే!

Monsoon Health Tips I 10 ఆరోగ్య జాగ్రత్తలు.. లేదంటే ముప్పే!

Monsoon Health Tips I చల్లని వాతావరణం.. కానీ ఆరోగ్యానికి హాట్ అలర్ట్

Monsoon Health Tips I ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌:

ఎండాకాలం ముగిసి వర్షాకాలం ప్రారంభమైంది. వర్షాలతో వాతావరణం చల్లబడుతుంది. అయితే అదే సమయంలో జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటి సీజనల్‌ అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. ఇవి సాధారణ సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండటం, వాతావరణ మార్పులు చోటుచేసుకోవడం వల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Monsoon Health Tips

Monsoon Health Tips I బయట ఆహారానికి నో చెప్పండి..

వర్షాకాలంలో బయట లభించే బజ్జీలు, టీ వంటి ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అయితే వీటిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ముఖ్యంగా బయట కట్‌ చేసి విక్రయించే పండ్లు లేదా మూతలేకుండా ఉంచిన ఆహారం తీసుకోవడం ప్రమాదకరం. వీలైనంత వరకు గోరువెచ్చని నీరు తాగడం, వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

Monsoon Health Tips I దోమలతో జర జాగ్రత్త..

వర్షాకాలం దోమల పెరుగుదలకు అనుకూలమైన సమయం. ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇంటి పరిసరాల్లోని గుంటలు, బకెట్లు, ట్యాంకులు వంటి చోట్ల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత అవసరం.

Monsoon Health Tips I ఈ ఫుడ్స్‌ బెస్ట్..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం అవసరం. వేడి సూప్‌లు, పప్పులు, ఆకుకూరలు, తాజా పండ్లు, తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. అధిక నూనె, ఎక్కువ మసాలా, చల్లని పదార్థాలను తగ్గిస్తే శరీరం సీజనల్‌ ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా ఎదుర్కోగలదు.

Monsoon Health Tips

Monsoon Health Tips I నిర్లక్ష్యం వద్దు..

జ్వరం, దగ్గు, గొంతునొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రెండు రోజులకంటే ఎక్కువ కొనసాగితే నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లోనే మందులు వాడుతూ ఆలస్యం చేయడం కంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం సురక్షితం. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధుల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.

మొత్తానికి వర్షాకాలాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. పరిశుభ్రమైన నీరు తాగడం, వేడి ఆహారం తీసుకోవడం, దోమల నియంత్రణ చేపట్టడం, తడి బట్టలను ఎక్కువసేపు ధరించకుండా ఉండటం వంటి అలవాట్లు పాటిస్తే ఈ సీజన్‌ను ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు.

Monsoon Health Tips

click here to read more: Jamun Health | షుగర్ పేషెంట్లకు నేరేడు పండు వరమా? రోజుకు ’10’ పండ్లు తింటే అద్భుత ప్రయోజనాలు!

Leave a Reply