Rs1500 | వారికి నెలకు రూ.1500

Rs1500 | వారికి నెలకు రూ.1500

Rs1500 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ముందు యువతకు భారీ ఆకర్షణగా మమతా బెనర్జీ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

యువ సాథీ’ పేరుతో ఈ పథకం నేటి నుంచే అమల్లోకి వచ్చింది. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల నిరుద్యోగులు ఈ సౌకర్యానికి అర్హులవుతారు. అర్హత కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే నెలవారీగా డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. ఎన్నికల ముందు యువతను ఆకట్టుకోవడానికి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఎంతో చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply