Railway Officials | పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

Railway Officials | పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు


Railway Officials | విజయవాడ డివిజన్‌లో భారీగా సర్వీసుల నిలిపివేత
తెనాలి, మచిలీపట్నం, ఒంగోలు, రాజమండ్రి మార్గాలపై తీవ్ర ప్రభావం
ఆపరేషనల్ కారణాలతో మే 23 నుంచి జూన్ 1 వరకు మార్పులు..
కీలక నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా పలు ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆపరేషనల్ కారణాలను చూపుతూ మే 23 నుంచి 25 వరకు, అలాగే మే 30 నుంచి జూన్ 1 వరకు అనేక కీలక మార్గాల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

అందరూ ఆధారపడే పాసింజర్ రైళ్లపైనే…
ప్రతిరోజూ వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు ఆధారపడే విజయవాడ–తెనాలి, విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఒంగోలు, విజయవాడ–బిట్రగుంట మార్గాల్లో రైళ్లు రద్దు కావడం ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వేసవి సెలవులు, వారాంతపు రద్దీ సమయంలో ఈ నిర్ణయం రావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

రద్దయిన రైళ్ల వివరాలు…
రైల్వే శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం విజయవాడ–తెనాలి మధ్య నడిచే 67213 రైలు, తెనాలి–విజయవాడ 67214 రైలు సేవలు నిలిపివేస్తున్నారు. అలాగే కాకినాడ పోర్టు–విశాఖపట్నం 17267, విశాఖపట్నం–కాకినాడ పోర్టు 17268 రైళ్లు కూడా రద్దు చేశారు. ఇదే క్రమంలో విజయవాడ–బిట్రగుంట 67259, బిట్రగుంట–విజయవాడ 67260, విజయవాడ–మచిలీపట్నం 67263, మచిలీపట్నం–విజయవాడ 67264 రైళ్లు కూడా నిర్ణీత తేదీల్లో నడవవని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా విజయవాడ–ఒంగోలు 67273, ఒంగోలు–విజయవాడ 67274, రాజమండ్రి–విశాఖపట్నం 67285, విశాఖపట్నం–రాజమండ్రి 67286 రైళ్లను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Railway Officials

కీలక రూట్లోనే ప్రభావం..
విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రోజువారీ ప్రయాణానికి కీలక ఆధారంగా ఉండటంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ బస్సులు, ఇతర రవాణా సదుపాయాల్లో చార్జీలు పెరిగే అవకాశముండటంతో సాధారణ ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. రైల్వే శాఖ ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ, పరీక్షలు, ఉద్యోగ అవసరాలు, వైద్య ప్రయాణాలు, కుటుంబ కార్యక్రమాల కోసం టికెట్లు బుక్ చేసుకున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దు చేసిన రైళ్లకు బదులుగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ప్రయాణికుల నుంచి వినిపిస్తోంది.

CLICK HERE TO READ Jangaon Fire : జనగామలో పరుశరామ ప్రీతి Andhra Prabha News

CLICK HERE TO READ MORE

Leave a Reply