మరణ మిస్టరీపై రోడ్డెక్కిన గ్రామస్థులు..

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ మండలo రామకృష్ణకాలనీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన శ్రీనిద్ మరణానికి గల కారణాలను వెల్లడించాలని సదాశివపల్లి గ్రామస్థులు అలుగునూర్ చౌరస్తా వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. శ్రీనిద్ మృతికి బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని బాధితుడి బంధువులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబసభ్యులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Leave a Reply