రహదారులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలి…
రహదారులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలి…
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
మోపిదేవి – ఆంధ్రప్రభ : రహదారులు నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మంజూరు చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేపట్టిన ప్రధాన రహదారులను పరిశీలించారు. మోపిదేవి మండలంలో ఉపాధి నిధులు రూ.97 లక్షలతో నిర్మిస్తున్న మోపిదేవి- వెంకటాపురం ప్రధాన రహదారి నాణ్యతను పరిశీలించారు.
ఉపాధి నిధులు రూ.49లక్షలు, జడ్పీటీసీ నిధులు రూ.15లక్షలు కలిపి రూ.64 లక్షలతో నిర్మిస్తున్న మోపిదేవి – కొక్కిలిగడ్డ ప్రధాన రహదారుల నిర్మాణ నాణ్యతను స్వయంగా పరిశీలించారు. రహదారులను నిబంధనలకు అనుగుణంగా కలకాలం మన్నేలా నిర్మించాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన రోడ్లపై వ్యవసాయ సీజనులో దమ్ము ట్రాక్టర్లు రింగు లేకుండా రాకపోకలు సాగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డీఈఈ పగడాల సురేష్ బాబు, పీఆర్ ఏఈఈ బొప్పన శ్రీనివాసరావు, కొక్కిలిగడ్డ సర్పంచ్ దిడ్ల జానకి రాంబాబు, ఎంపీటీసీ సనకా వెంకట రాజేష్ బాబు, ఇంజినీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
