రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం
రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం
పెడన – ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు రైతులకు అవగాహన కల్పించడం కోసం పెడన రూరల్ మండలం పరిధిలో “రైతన్న మీ కోసం“ కార్యక్రమాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, స్థానిక అధికారులు కూటమి నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల ద్వారా రూ.2677 కోట్ల ఆర్థిక సహాయం అందించామని తెలిపారు.
వ్యవసాయ అధికారులు వ్యవసాయ అభివృద్ధికి ఊతమిచ్చే పంచ సూత్రాలతో పాటు వివిధ అంశాలపై రైతులకు ఈ కార్యక్రమంలో అవగాహన కల్పించారు.. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధికారులు, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
