అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
పాయకాపురం, ఆంధ్రప్రభ:
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్‌చార్జీలు, డివిజన్ కమిటీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు అత్యంత బాధ్యతాయుతంగా తీసుకోవాలని సూచించారు. అర్హులైన యువత, కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని కోరారు.డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన తెలిపారు.
