6,565 పోస్టులతో ఆర్‌ఆర్‌బీ భారీ రిక్రూట్‌మెంట్!

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్, గ్రేడ్-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జూన్ 30, 2026 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 6,565 (టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ – 323, టెక్నీషియన్ గ్రేడ్-III – 6,242).
దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 30, 2026.
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 29, 2026.
అర్హత ప్రమాణాలు:
వయోపరిమితి : జూలై 1, 2026 నాటికి 18 నుండి 30/33 సంవత్సరాల మధ్య ఉండాలి.
విద్యార్హతలు : పదో తరగతి (10th) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) లేదా ఇంటర్మీడియట్ (MPC), ఇంజనీరింగ్ డిప్లొమా/డిగ్రీ లేదా బీఎస్సీ (B.Sc) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
జీతభత్యాలు:
టెక్నీషియన్ గ్రేడ్-I (సిగ్నల్): నెలకు రూ. 29,200 బేసిక్ పే (అలవెన్సులు అదనం).
టెక్నీషియన్ గ్రేడ్-III: నెలకు రూ. 19,900 బేసిక్ పే (అలవెన్సులు అదనం).

ఎంపిక విధానం:
రాత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల (Medical Test) ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు, దరఖాస్తు కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ (rrbapply.gov.in) ను సందర్శించవచ్చు.