ఉత్తమ్ కుమార్ రెడ్డివి అన్ని ఉత్త మాటలే

ధాన్యం కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వమే
ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి: రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని ఉత్త మాటలే చెబుతాడని, తెలంగాణ రాష్ట్రం లో రైతాంగం బతుకుతున్నారు అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లేనని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యాభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి కొనుగోలు చేసిందని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నుంచి ఎక్కువగా 1/3 ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రభుత్వం చేసిందన్నారు. రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమైందని, క్షేత్ర స్థాయిలో చేసింది శూన్యమన్నారు. వరంగల్ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.