పీఎంజే దొంగతనం కేసులో కీలక మలుపు…
కరీంనగర్ క్రైమ్ ; పీఎంజే జ్యువెలర్స్ దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారిగా భావిస్తున్న సుబోధ్ సింగ్‌ను నాలుగు రోజుల క్రితం కరీంనగర్ పోలీసులు పీటీ వారెంట్‌పై కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో భాగంగా నిందితుడిని పోలీస్ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరగా, కోర్టు అనుమతి మంజూరు చేసింది.
దీంతో సుబోధ్ సింగ్‌ను పోలీసులు శుక్రవారం కస్టడీలోకి తీసుకోనున్నారు. కస్టడీ విచారణ సందర్భంగా దొంగతనానికి సంబంధించిన కీలక వివరాలు, ఇతర నిందితుల పాత్ర, చోరీ చేసిన ఆభరణాల ఆచూకీ తదితర అంశాలపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.
