అభివృద్ధికి అధికారులు తోడ్పాటున అందించాలి

అభివృద్ధికి అధికారులు తోడ్పాటున అందించాలి

  • జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్

మహబూబాబాద్, ఆంధ్రప్రభ ; అధికారులు గూడూరు మండల అభివృద్ధికి తోడ్పాటున అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. బుధవారం గూడూరు మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు మండలం సాగు తాగునీరు తోపాటు సాగు భూముల పట్టా తదితర విషయాలపై అధికారులతో పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్వహించారు. గూడూరు మండలంలో ఉన్న రైతులకు సాగునీరు అందే విధంగా ప్రణాళికల సిద్ధం చేయాలని ఐబి అధికారులకు ఆదేశించారు.

వట్టివాగు సమ్మక్క సారలమ్మ ప్రాంతంలో జగడాముల నిర్మాణం తోపాటు సాగుని రందించడం కోసం కావలసిన జగడాములు పైపులైన్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని భూములు సాగు చేసుకుంటున్నా రైతులకు పట్టాలు అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో, సిఇ సుధీర్, ఎస్సీఈ రామకృష్ణ తోపాటు డీఈ ఏఈలు తాసిల్దార్ నాగభవాని ఎంపీడీవో సత్యనారాయణ, బిజెపి నాయకులు ధర్మారెడ్డి, వెంకన్న, సురేందర్ తో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు