సైబర్ మోసగాళ్లకు అవకాశం ఇవ్వద్దు..
సైబర్ మోసగాళ్లకు అవకాశం ఇవ్వద్దు..
ఎస్సై ఉదయ్ కిరణ్
జన్నారం, ఆంధ్రప్రభ : సైబర్ మోసగాళ్లకు ప్రజలు అవకాశం ఇవ్వవద్దని స్థానిక ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో సైబర్ నేరాలపై గురువారం మధ్యాహ్నం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, అనుమానిత ఫోన్లు వస్తే స్పందించవలసిన అవసరం లేదన్నారు. ఎలాంటి ఓటీపీలు చెప్పకూడదని,సైబర్ మోసగాళ్లు మోసం చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తూ, సీట్ బెల్ట్, హెల్మెట్లు పెట్టుకోవాలని ఆయన సూచించారు.మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ బక్కయ్య, హెచ్ఎం కట్ట రాజమౌళి, పశువైద్యాధికారి శ్రీకాంత్, గ్రామ సర్పంచి బొంతల నాగమణి-మల్లేష్, ఉపసర్పంచి లింగయ్య,ఏఈఒ దివ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.
