Revanth Reddy | మాస్టర్‌ ప్లాన్​పై సీఎం సమీక్ష

Revanth Reddy | మాస్టర్‌ ప్లాన్​పై సీఎం సమీక్ష

Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బాసర ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాసర ఆలయ అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్​పై ఆయన సమీక్ష నిర్వహించారు. అధికారులు చూపించిన ప్లాన్​ను పరిశీలించిన సీఎం అందులో పలు సూచనలు చేశారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం అభివృద్ధి జరగాలన్నారు.

భవిష్యత్ అవసరాలు, రద్దీ దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండేలా చూడాలని, ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలే వాడేలా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశించారు. ఈనెల 6న బాసర ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం చేయనున్నారు. రూ.225 కోట్లతో ఈ అభివృద్ధి పనులు జరపనున్నారు.

Leave a Reply