VOTERS | గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తా..

VOTERS | గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తా..

  • పెద్దపోర్ల సర్పంచ్ అభ్యర్థి కమ్మరి మణెమ్మ

VOTERS | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఓటేసి ఆశీర్వదిస్తే.. సేవకురాలిగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకుంటానని కాంగ్రెస్ బలపరిచిన పెద్దపోర్ల అభ్యర్థి కమ్మరి మణెమ్మ నర్సింలు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామంలో వార్డు అభ్యర్థులతో కలిసి ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికి మంజూరు చేయడంతో పాటు గ్రామ సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తనను గెలిపిస్తే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామానికి ప్రతినిత్యం ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా చూస్తానని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్లు మంజూరు చేస్తానన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేసి చెరువు కట్ట వద్ద రహదారి మరమ్మతులు చేపడతానన్నారు. మహిళగా పోటీ చేసేందుకు మంత్రి అవకాశం కల్పించారని గ్రామస్తులు అందరూ ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వార్డు అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply