ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా సాగడానికి అందరూ సహకరించాలి..

స్థానిక తహసిల్దార్ బక్కయ్య

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : ఎస్ఐఆర్ ప్రక్రియ సజీవుగా సాగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని స్థానిక తహసిల్దార్ బక్కయ్య అన్నారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై మంచిర్యాల జిల్లా జన్నారం ఎంపీడీవో సమావేశం హాలులో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎస్ఐఆర్ ప్రక్రియను ఉద్యోగులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

ఆ ప్రక్రియ యొక్క ఉద్దేశ్యం, విధివిధానాలు, అమలు తీరు, ఓటరు జాబితాల పరిశీలనలో అనుసరించాల్సిన చర్యల గురించి ఆయన సమగ్రంగా వివరించారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మారై వెంకటేశం, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.