Nominations | మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు

Nominations | మోత్కూర్ మున్సిపల్ బరిలో 49 మంది అభ్యర్థులు

  • 31 మంది నామినేషన్లు ఉపసంహరణ
  • పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

Nominations | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు సంబంధించి 80 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా,నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల లోపు 31 మంది అభ్యర్థులు ఉపసంహరణ చేసుకోగా 49 మంది అభ్యర్థులు ఆయా వార్డులలో పోటీలో ఉన్నట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్ తెలిపారు. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు లోపు పార్టీ ఏ, బి ఫారం లు అందించడంతో వారిని పార్టీ అభ్యర్థులు గా గుర్తించి పార్టీ గుర్తులు కేటాయించినట్లు,మినహా అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులు గా గుర్తించి గుర్తులు కేటాయించినట్లు కమిషనర్ తెలిపారు.కాంగ్రెస్ తరపున 11 మంది,బి ఆర్ ఎస్ తరపున 11 మంది,బీజేపీ తరపున 12 మంది,సీపీఎం 1,సీపీఐ 1,విద్యార్థుల రాజకీయ పార్టీ 1,స్వతంత్ర అభ్యర్థులు 12 మంది చొప్పున మొత్తం 12 వార్డుల్లో 49 మంది కౌన్సిలర్ స్థానాలకు పోటీలో ఉన్నట్లు తెలిపారు.

అభ్యర్థుల్లో టెన్షన్ ..టెన్షన్…హడావిడిగా ఉపసంహరణ ….కాంగ్రెస్ లో తప్పిన రెబల్స్ పోరు

సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్, బి ఆర్ ఎస్ పార్టీల అభ్యర్థులకు బి ఫారం లు అందించడంతో కాంగ్రెస్,బి ఆర్ ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ గడువు ముగుస్తుండడంతో సోమవారం రాత్రి నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అదే పార్టీ నుండి రెబల్ గా నామినేషన్ వేసిన అభ్యర్థుల దగ్గరకు వెళ్లి బుజ్జగింపులకు పాల్పడడం,ఎమ్మెల్యే సామెల్, ముఖ్య నాయకుల ప్రమేయం తో నామినేషన్ లు ఉపసంహరణ చేయడంలో సఫలీకృతం కావడంతో ఎట్టకేలకు 11 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులకు రెబల్స్ బెడద తప్పింది.

కేవలం 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్ధిని మొగుళ్ళ స్వాతి కి కేటాయించడంతో , కాంగ్రెస్ కి చెందిన మాజీ కౌన్సిలర్ మలిపెద్ది రజిత రాంరెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అదే వార్డులో బి ఆర్ ఎస్ నుండి గతంలో ఓటమి చెందిన మొగుళ్ళ అనురాధ బి ఆర్ ఎస్ లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

Leave a Reply