Repairs | ఊరవాగు వద్ద తాత్కాలిక కల్వర్టు మరమ్మత్తులు

Repairs | ఊరవాగు వద్ద తాత్కాలిక కల్వర్టు మరమ్మత్తులు
- ఇచ్చిన హామీ మేరకు గ్రామ సౌకర్యానికి నిర్మాణం
Repairs | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీ మేరకు రాయిగూడెం బాటన్న నగర్ వెళ్లే దారిలోని వూరవాగు వద్ద రోడ్డు అధ్వాన్నంగా తయారై గ్రామ ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆళ్లపల్లి ఉపసర్పంచి సయ్యద్ ఆరిఫ్ ఆధ్వర్యంలో తాత్కాలికంగా గ్రావెల్ మోరీలను సమకూర్చడం జరిగిందని తెలిపారు.
కొంతకాలంగా ఈరహదారి గుండా గుంతలమయంగా మారడంతో వాహనదారులకు తీవ్రఅంతరాయం ఏర్పడడంతో స్థానిక సర్పంచ్ వాసం సుస్మిత స్పందించి, ఈ రోజు సర్పంచ్ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన రోడ్డుపై గ్రావెల్ (మొరం) పోయించి, రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డు పనులను ఉపసర్పంచి సయ్యద్ ఆరిఫ్, వార్డు సభ్యులు జోగా సరమ్మ,కొడెంసత్యం, బూరుగడ్డ కృష్ణలు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
పనులు నాణ్యంగా జరిగేలా చూస్తూ, ప్రజలకు, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పండించిన పంటలు క్రయవిక్రయాలు మండల కేంద్రంలో వ్యాపారుల వద్దకు తీసుకురావడంతో సులభతరంగా పంటలు అమ్ముకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుందని భావించి తాత్కాలిక కల్వర్టు రోడ్డును మొరంను ట్రాక్టర్ జేసీబీల సహాయంతో మరమ్మతులను చూయించడం జరిగిందని ఉప సర్పంచ్ సయ్యద్ ఆరిఫ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాయిగూడెం గ్రామ ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని, శ్రమదానం చేస్తూ సహకరించారు. రోడ్డు మరమ్మతు పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం గర్వకారణమని భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ ఆదామ్ అన్నారు.
