Boxing | హనుమకొండలో బాక్సింగ్ పోటీలు

Boxing | హనుమకొండలో బాక్సింగ్ పోటీలు
- పాల్గొననున్న బెల్లంపల్లి సీఓఈ విద్యార్థి నరసింహ
Boxing | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : హనుమకొండలోని హనుమకొండ బాక్సింగ్(Boxing) హాల్‌లో గురువారం (డిసెంబర్ 18) నుంచి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో బెల్లంపల్లి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీఓఈ) విద్యార్థి నరసింహ పాల్గొననున్నాడు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సీఓఈలో 9వ తరగతి చదువుతున్న నరసింహ ఈ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ తెలిపారు.
ఈ నెల 8న కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన అండర్–14(Under-14) విభాగం బాక్సింగ్ పోటీల్లో నరసింహ ఉత్తమ ప్రదర్శన కనబర్చి బంగారు పతకం సాధించడంతో పాటు రాష్ట్రస్థాయి(State Level) పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆకిడి విజయసాగర్ ఈ రోజు బెల్లంపల్లి సీఓఈలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ విద్యార్థిని అభినందించారు.
విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే క్రీడా భవిష్యత్తుతో పాటు క్రమశిక్షణ(Discipline) కూడా అలవడుతుందని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దశరథం, కొండలరావు, విజయ్, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ముచ్చక్కుర్తి రాజశేఖర్ పాల్గొన్నారు. పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈ బాక్సింగ్ పోటీలు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హనుమకొండలోని బాక్సింగ్ హాల్‌లో జరగనున్నాయి.
