Inter Student Dies : విద్యార్థిని హఠన్మరణం Andhra Prabha Crime News

Inter Student Dies : విద్యార్థిని హఠన్మరణం Andhra Prabha Crime News
- కరెంటు షాక్ ..
- ఈదురుగాలుల బీభత్సం
- తెగిపడిన విద్యుత్తు తీగ
- మంచినీళ్లకు వెళిన బాలిక అక్కడిక్కడే మృతి
పమిడిముక్కల – ఆంధ్రప్రభ
Inter Student Dies : కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలానికి చెందిన లంకపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థిని ముళ్లపూడి అంకిత (16) మృతి చెందింది. శుక్రవారం ఉదయం మంచినీళ్ల కోసం లంకపల్లి మెయిన్ స్కూల్ కుళాయి వద్దకు వెళ్లిన అంకిత నిన్న రాత్రి ఈదురు గాలులకు తెగిపడి ఉన్న విద్యుత్ వైరు తగిలి ప్రమాదం సంభవించింది. తెగిపడిన వైర్లలో విద్యుత్ ప్రవహించడంతో, విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించింది. ఘటన తో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు, పోలీసు, అధికారులు విచారణ చేపడుతున్నారు.
