గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నికల అధికారిగా ఎల్ రాము జి అశోక్ కుమార్ ల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. శనివారం ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ప్రధానోపాధ్యాయుల రాష్ట్ర గెజిటెడ్ అధ్యక్షుడిగా రాథోడ్ ప్రకాష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇరుప సారయ్యను ఎన్నుకోగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా బద్రు నాయక్, ఉపాధ్యక్షులుగా ప్రేమ్ దాస్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డివైడిఈఓ(టీడబ్ల్యూ) గోడం చందన్ ఏపీవో (పిఈటిజి) (tw) ఆత్రం భాస్కర్, బి.ఎడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉట్నూర్ ఆర్ మాణిక్ రావు, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
