చేపల వలలో చిక్కిన మొసలి
చేపల వలలో చిక్కిన మొసలి
ఇటిక్యాల, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలోని సొసైటీ చెరువులో గత రెండు రోజులుగా మత్సకారులు చేపలు పడుతున్నారు. ఆ క్రమంలో చేపల వలలో మొసలి చిక్కుకోవడం జరిగిందని చెరువు సొసైటీ మెంబర్ తిమ్మాపూర్ నారాయణ నాయుడు ఆదివారం తెలిపారు. చిక్కుకున్న మొసలి అప్పగించేందుకు స్థానిక పోలీస్ శాఖ, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందజేసినట్లు నారాయణ నాయుడు తెలిపారు.

