poxo| ఇంటర్ బాలికపై అత్యాచారం..

poxo|ఇంటర్ బాలికపై అత్యాచారం..
- నిందితుడిపై పోక్సో కేసు నమోదు
poxo|గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరులో పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అచ్చంపేట మండలం క్రోసూరుకు చెందిన ఒక బాలిక గుంటూరులోని తమ బంధువుల ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. ఒక యువకుడు ఆ బాలికతో పరిచయం పెంచుకుని నగరంలోని ఒక లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య పరీక్షల్లో కూడా నిర్ధారణ అయింది. కుటుంబ సభ్యుల పిర్యాదుతో నిందితుడిపై పట్టాభిపురం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
