ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లెందు, ఆంధ్రప్రభ : పట్టణంలోని జేకే ఏరియాలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులు, వారి సహాయకులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఇన్-ఔట్ గేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం ఆసుపత్రి నిర్మాణంలోని వివిధ పనులను పరిశీలించి, నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ రవిబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.