వారానికి ఒక రోజైనా సైకిల్ వినియోగిద్దాం..

వారానికి ఒక రోజైనా సైకిల్ వినియోగిద్దాం..

సైకిల్ విని యోగించడంతో ఇంధనం పొదుపు
నగర్ కమిషనర్ హెచ్ కూర్మా రావు..

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : రండి చేయి చేయి కలుపుదాం వారానికి ఒక రోజైనా సైకిల్ విని యోగిద్దాం సైకిల్ విని యోగించడంతో ఇంధనం పొదుపు. ఆరోగ్య ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ కాపాడుకోవచ్చునని . నగర్ కమిషనర్ హెచ్ కూర్మా రావు అన్నారు. నగర్ కమిషనర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక రామ్ లక్ష్మణ్ జంక్షన్ నుండి పెదపాడు వరకు. పెదపాడు నుండి రామలక్ష్మి వరకు నగరపాలక సంస్థ సిబ్బందితో సుమారు 70 సైకిల్స్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నగర్ కమిషనర్ మాట్లాడుతూ,.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు ఇంధనం పొదుపు లో భాగంగా వారానికి ఒక్కసారైనా సైకిల్ వినియోగించి ఇంధనం పొదుపు చేయాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాంమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం ప్రతి వారం జరుగుతుందని తెలిపారు కాగా రామలక్ష్మి నుండి పెద్దపాడు వరకు ఇరువైపులా డ్రైనేజ్ ఇబ్బంది ఉందని. ఉదయం సమయంలో నడిచి వెళ్లే వారికి చాలా దుర్వాసన వచ్చే విధంగా ఉందని ఆయన భావించి ఇరువైపులా పరిశుభ్రం చేయుటకు మున్సిపల్ వర్కర్స్ ని పెట్టి శుభ్ర పరుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నగరంలో అన్ని డివిజన్ లను పరి శుభ్రం చేయుటకు ఒక గొప్ప సంకల్పం తో ఈ పని చేయుటకు తాము ఉన్నామని, అదేవిధంగా ప్రజలు కూడా సహకరించాలని నగర్ కమిషనర్ కోరారు.

ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ఎం హెచ్ ఓ సుధీర్ మాట్లాడుతూ, నగరంలో అన్ని చోట్ల డ్రైనేజ్ చాలా ఇబ్బందికరంగా ఉందని వాటి పై ప్రత్యేక డ్రైవ్ కొనసాగిస్తున్నామని వాటిపై ప్రత్యేక బృందాల ద్వారా ఆ డ్రైనేజీలను వ్యర్ధాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పారిశుధ్య శాఖ అధికారులు ఇన్స్పెక్టర్ గణేష్, సూపర్వైజర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply