GPS| ధాన్య రవాణాకు అవకాశం కల్పించాలి..

GPS| మొవ్వ, ఆంధ్రప్రభ : గత వారం రోజుల నుంచి మండలంలో యంత్రాలతో వరి ధాన్యం నూర్పుళ్ళు జరుగుతున్నాయి. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్ వలన వరి పంటకి మానుగాయి సోకి పంట దిగుబడి తగ్గింది. మరోపక్క నూర్చిన ధాన్యం రంగు మారిందని మిల్లర్లు రైతులు వద్ద కొనుగోలు నిలుపుదల చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా గ్రామంలో యంత్రాల ద్వారా నూర్పుళ్ళు జరిగిన ప్రతి గింజను యుద్ధ ప్రతిపాదికన కొనుగోలు చేసి రైతుల ఆదుకోవాలని కృష్ణా జిల్లా కౌలు రైతు సంఘం సహాయ కార్యదర్శి శీలం నారాయణరావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని అయ్యంకి, కారకంపాడు, చినముత్తేవి, అవిరిపూడి గ్రామాలలో పర్యటించి నూర్చి పరదాలపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు.

అనంతరం వారు చిన ముత్తేవి గ్రామంలో విలేకరులతో మాట్లాడుతూ.. దిత్వా తుఫాను పరిస్థితి నేపథ్యంలో నూర్చిన పతి గింజను రైతుల వద్ద సేకరించి ఆయా మిల్లర్లు తరలించాలని రైతులు నష్టపోకుండా కాపాడాలని.. అన్ని గ్రామాలకు కావలసిన గోనె సంచులు, లారీలు పరదాలు, సప్లై చేయాలని, జీపీఎస్ లేని లారీలకు కూడా తుఫాన్ నేపథ్యంలో అనుమతి ఇచ్చి రోడ్లపై ధాన్యం నిల్వ లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవంగా రంగు మారిన ధాన్యం బియ్యపు గింజ ఏమాత్రం నష్టపోలేదు వడ్ల గింజపై మానుగాయ కలర్ మాత్రమే అతుక్కుని రంగు మారినట్టుగా కనిపిస్తుంది. ఈ వాస్తవాన్ని ప్రభుత్వ అధికారులు, రైస్ మిల్లర్లు పరిశీలించి రంగు మారిన ధాన్యాన్నికి నిబంధనలు తరలించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణరావు తో పాటు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave a Reply